మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు షెడ్యూల్ ఖరారు

by Nagaya |
మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు షెడ్యూల్ ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో : శాసన మండలి చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక షెడ్యూలు ఈ నెల 10న విడుదల కానుంది. అదే రోజు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నిక అనివార్యమైతే ఈ నెల 11న మండలి చైర్మన్‌ ఎన్నిక జరుగనుంది. ఏకగ్రీవమైతే అదే రోజు శాసన మండలి నూతన చైర్మన్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల చేసి 12న కొత్త డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకుని బాధ్యతలు అప్పగిస్తారు.

2021 జూన్‌ 3న శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ఎమ్మెల్సీలుగా పదవీ కాల పరిమితి పూర్తయింది. ఆ తర్వాత ప్రొటెమ్‌ చైర్మన్‌గా వి.భూపాల్‌రెడ్డి ని ఎన్నుకున్నారు. ఆయన పదవికాలం కూడా ఈ ఏడాది జనవరి 4న పూర్తయింది. తిరిగి జనవరి 12న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ అమీనుల్‌ జాఫ్రీ ప్రొటెమ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కొనసాగుతున్నారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాశ్ ను నియమించే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Next Story