Savitri Jindal: ఆసియా రిచెస్ట్‌ విమెన్‌గా సావిత్రి జిందాల్‌

by Harish |   ( Updated:2022-07-30 12:34:32.0  )
Savitri Jindal Becomes Asias Richest Woman
X

న్యూఢిల్లీ: Savitri Jindal Becomes Asias Richest Woman| ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్‌ 72 ఏళ్ల సావిత్రి జిందాల్ నిలిచారు. భారతదేశానికి చెందిన జిందాల్ 11.3 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఇప్పటిదాకా ఆసియా సంపన్న మహిళగా ఉన్న యాంగ్ హుయాన్‌‌ను దాటి సావిత్రి ముందుకు దూసుకొచ్చారు. సావిత్రి భర్త, సంస్థ వ్యవస్థాపకుడు OP జిందాల్ 2005లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన కొద్దికాలానికే ఆమె జిందాల్ గ్రూప్‌కు చైర్మన్ అయ్యారు. జిందాల్ కంపెనీ భారతదేశంలో ఉక్కు ఉత్పత్తిలో మూడవ అతిపెద్దది. సిమెంట్, ఇంధనం, మౌలిక సదుపాయాలలో సహా ఇతర పరిశ్రమలలో అగ్రగామిగా ఉంది. 2021లో ఫోర్బ్స్ అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో 18 బిలియన్ల డాలర్ల నికర సంపదతో సావిత్రి జిందాల్‌ చోటు సంపాదించారు.

ఇటీవలి కాలంలో జిందాల్ నికర విలువ విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనైంది. ముఖ్యంగా కొవిడ్-19 కారణంగా 2020 ఏప్రిల్‌లో 3.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో 2022 ఏప్రిల్‌ నాటికి సంపద 15.6 బిలియన్ల డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. చైనాలో రియల్ ఎస్టేట్ సెక్టార్‌ పడిపోవడం కారణంగా అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ అయిన కంట్రీ గార్డెన్ మేజర్‌ వాటాదారురాలైన యాంగ్‌ సంపద భారీగా పడిపొయింది. ఈమె 2005లో రియల్ ఎస్టేట్ డెవలపర్‌ అయిన తన తండ్రి వాటాను వారసత్వంగా పొందింది. ఈ భూమి మీద ఎక్కువ సంపద గల అత్యంత పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు యాంగ్ హుయాన్. ఆమె సంపద ఈ సంవత్సరం సగానికి పైగా తగ్గి $11 బిలియన్లకు చేరుకుంది. దీంతో బిలియనీర్ ఇండెక్స్‌లో తన ర్యాంక్‌ను కోల్పోయారు. గత ఐదు సంవత్సరాలుగా ఆమె ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా ఉంది.

ఇది కూడా చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో దూసుకెళ్తున్న అదానీ! ఫోర్బ్స్ ర్యాంకులో నాలుగో స్థానం

Advertisement

Next Story

Most Viewed