ఒక్కరోజులో 81 మందికి ఉరిశిక్ష అమలు!.. సౌదీ సరికొత్త రికార్డు

by Mahesh |
ఒక్కరోజులో 81 మందికి ఉరిశిక్ష అమలు!.. సౌదీ సరికొత్త రికార్డు
X

రియాద్: ఎడారి దేశం సౌదీ అరేబియా ఉరిశిక్ష అమలు చేయడంలో సరికొత్త రికార్డు సృష్టించింది. శనివారం ఒక్కరోజే గరిష్టంగా 81 మందికి ఉరిశిక్ష ను అమలు చేసినట్లు నివేదిక పేర్కొంది. వీరంతా దాదాపు ఉగ్ర తరహా చర్యలో పాలుపంచుకున్నారని వెల్లడించింది. ఈ మేరకు సౌదీ ప్రెస్ ఏజెన్సీ అధికారక ప్రకటన చేసింది. వీరంతా ఐఎస్ గ్రూప్, అల్ ఖైదా, యెమెన్ హుతీ రెబల్ ఫోర్సెస్, ఇతర ఉగ్రసంస్థల తో కార్యకలాపాలు కొనసాగించినట్లు పేర్కొంది.ముఖ్యంగా వీరి చర్యలతో దేశ ఆర్థిక రంగంపై ప్రభావం తో పాటు భద్రతా సిబ్బందిపై దాడులు చేశారని వెల్లడించింది.

అంతేకాకుండా అక్రమ ఆయుధ రవాణాలో భాగమయ్యారని తెలిపింది. వీరిలో 73 మంది సౌదీ పౌరులు కాగా, ఏడుగురు యెమెనీలు, ఒకరు సిరియన్ అని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఉరిశిక్ష అమలు చేస్తున్న దేశాలలో సౌదీ ఒకటిగా ఉంది. అయితే 2021లో అమలు చేసిన ఉరిశిక్షలు 69 కావడం గమనార్హం. అంతకుముందు మసీదు పేలుళ్ల కేసులో సౌదీలో 1980 జనవరి లో 63 మంది ఉరితీశారు.

Advertisement

Next Story