- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాక్సిన్ పై అపోహలు వద్దు.. వంద శాతం పూర్తి చేయాలి
దిశ, వర్గల్: మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ డే సందర్భంగా సర్పంచ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. 12-14 సంవత్సరాల మధ్య వయస్సు గల వారందరూ తప్పక టీకా తీసుకోవాలని, గ్రామ వార్డు మెంబర్లు తమతమ వార్డులలో 12-14 వయస్సు గల వారందరూ టీకా తీసుకునే విధంగా చూడాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు నేషనల్ వ్యాక్సిన్ డే అయిన మార్చి 16వ తేదీన 12-14 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల్లోని పిల్లలకు టీకా వేసి కార్యక్రమాన్ని గోపాల్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి హరిత మాట్లాడుతూ.. 15 మార్చి 2010 తేదీకి ముందు జన్మించిన పిల్లలు అందరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు అని తెలిపారు. టీకాల కార్యక్రమం నేటి నుండి మొదలవుతుంది కావున పట్టణ ప్రభుత్వ పీహెచ్‌సీలలో వాక్సినేషన్ అందించటం జరుగుతుందన్నారు. మంత్రి హరీష్ రావు పర్యవేక్షణలో వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లను చేసిందని తెలిపారు. ఎఎన్ఎంలు, ఆశ వర్కర్ల కృషి ఎంతో ఉందని గుర్తించి వారిని సత్కరించారు.కార్యక్రమంలో డాక్టర్లు శ్రీనివాస్, ఎ ఎన్ ఎం లు, తిరుపతమ్మ,ఆశా వర్కర్లు,కనక లక్ష్మీ,అంజలి,శ్యామల నవీన, తదితరులు పాల్గొన్నారు.