Sanya Malhotra: దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేదు.. స్టార్ నటి

by Manoj |   ( Updated:2022-07-15 10:02:22.0  )
Sanya Malhotra Expresses Concern Over Womens Safety In Delhi
X

దిశ, సినిమా : Sanya Malhotra Expresses Concern Over Women's Safety In Delhi| 'దంగల్' బ్యూటీ సన్యా మల్హోత్ర ఇండియాలో, ముఖ్యంగా దేశ రాజధానిలో మహిళలకు రక్షణ కరువైందంటోంది. 'హిట్: ది ఫస్ట్ కేస్' సినిమాతో జూలై 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భామ.. మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు సురక్షిత ప్రదేశం కాదని, భద్రతా కారణాల రీత్యా ముంబైతో పోల్చుకుంటే ఢిల్లీ చాలా ప్రమాదకరమని అభిప్రాయపడింది.

'నేను ఢిల్లీ వాసినే. కానీ, ముంబై‌లో ఉండటానికే ప్రాధాన్యం ఇస్తాను. ఎందుకంటే ఢిల్లీలో ప్రతి మహిళలు ఈవ్ టీజింగ్‌ను ఎదుర్కొంటున్నారు. కనీసం రోజుకొకరైనా లైంగిక వేధింపుల బారిన పడుతున్నారు. ముంబైలో అలా కాదు. ఈ సురక్షితమైన ప్రదేశంలో స్ర్తీలు స్వేచ్ఛగా బతుకుతున్నారు' అని తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌కు చెందిన భూషణ్ కుమార్, దిల్ రాజు, కృష్ణన్ కుమార్, కుల్దీప్ రాథోర్ నిర్మించగా శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.

ఇది కూడా చదవండి: మళ్లీ ఒక్కటైన శింబు-హన్సిక.. ప్రేమ చిగురించిందే!

Advertisement

Next Story