జిల్లా జైలును సందర్శించిన ట్రైనీ అధికారులు

by Vinod kumar |
జిల్లా జైలును సందర్శించిన ట్రైనీ అధికారులు
X

దిశ, కంది: సంగారెడ్డి జిల్లా జైలును తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ అధికారులు శుక్రవారం సందర్శించారు. మొత్తం 32 మంది అధికారుల బృందం సభ్యులు జైల్లో ఖైదీలకు కల్పిస్తున్న సదుపాయాలు ఇతర పనితీరును పరిశీలించారు. అయితే గతంలో సంగారెడ్డి జిల్లా జైలుకు ఉత్తమ జిల్లా జైలు అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రైనీ అధికారులు ఇక్కడికి వచ్చి జైలును సందర్శించిన అనంతరం చాలా బాగుందంటూ.. కితాబు ఇచ్చినట్లు ఇక్కడి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ భరత్ దండ, జైలర్ సంజీవరెడ్డి, డిప్యూటీ జైలర్ గౌతమ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story