Pushpa-2 : సంధ్య ధియేటర్లో తొక్కిసలాట... ముగ్గురి అరెస్ట్

by M.Rajitha |   ( Updated:2024-12-08 14:41:53.0  )
Pushpa-2 : సంధ్య ధియేటర్లో తొక్కిసలాట... ముగ్గురి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్ర(Pushpa-2 Movie) విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందగా, బాలుడికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్(Allu Arjun), పుష్ప టీం మీద కేసులు నమోదు చేయగా.. తాజాగా ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. థియేటర్ యజమానితోపాటు, మేనేజర్, సెక్యూరిటీని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగరంలోని సంధ్య థియేటర్లో పుష్ప ప్రీమియర్ షోకి కుటుంబంతో సహ అల్లు అర్జున్ రాగా.. ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెంది, ఆమె కుమారుడి పరిస్థితి విషమించగా.. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సీరియస్ అయిన సౌత్ సెంట్రల్ జోన్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. థియేటర్లో సరైన భద్రతా చర్యలు చేపట్టక పోవడం వల్లే తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెందిందని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed