Sankranti special: లైన్ క్లియర్.. సంక్రాంతికే ఆ యంగ్ హీరో సినిమా!

by sudharani |   ( Updated:2024-10-24 15:46:34.0  )
Sankranti special: లైన్ క్లియర్.. సంక్రాంతికే ఆ యంగ్ హీరో సినిమా!
X

దిశ, సినిమా: యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) నటిస్తున్న తాజా చిత్రం ‘మజాకా’ (Majaka). ‘ధమాకా’ ఫేమ్ డైరెక్టర్ త్రినాధరావు (Trinadha Rao) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రీతువర్మ (Rituvarma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రావు రమేశ్, అన్షు కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి (Sankranti) రిలీజ్ కానుందని ఇప్పటికే చిత్ర బృందం (Movie Team) అనౌన్స్ చేశారు. కానీ.. సంక్రాంతి బరిలో ఇప్పటికే రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ (Balakrishna) ‘NBK 109’ ఉన్నాయి.

ఇక వాటితో పాటు వెంకటేష్ (Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో చిత్రం కూడా సంక్రాంతికే రిలీజ్ చెయ్యనున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే నాగచైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ కూడా సంక్రాంతి బరిలోనే ఉండనుందని వార్తలు రావడంతో.. థియేటర్స్ తక్కువ అయ్యే ప్రమాదం ఉండటం కారణంగా ‘మజాకా’ రిలీజ్ వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. వెంకీ రావిపూడి సినిమా నుంచి అప్‌డేట్స్ (Updates) ఎక్కువగా రాకపోవడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ (Post Pone) అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నాగచైతన్య ‘తండేల్’ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుందని వార్తలు రాగా.. చిత్ర బృందం తమ నిర్ణయాన్ని చేంజ్ చేసుకున్నట్లు టాక్. దీంతో సందీప్ కిషన్‌కు కొంచెం లైన్ క్లియర్ కావడంతో.. ఈ మూవీకి ఎక్కువ థియేటర్స్ (Theatres) దొరికే అవకాశం ఉండటంతో సంక్రాంతికే రిలిజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇక రిలీజ్ (release) డేట్ కూడా త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ చెయ్యనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story