సమంతకు 'యశోద' కష్టాలు.. మరోసారి వాయిదా?

by GSrikanth |
సమంతకు యశోద కష్టాలు.. మరోసారి వాయిదా?
X

దిశ, సినిమా : హరీష్ దర్శకత్వంలో సమంత నటించిన అప్‌కమింగ్ ఫిల్మ్ 'యశోద'. ఖైదీగా బంధించబడిన ఓ మహిళ కథాంశంతో సర్వైవల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్ర రిలీజ్ చాలాకాలంగా వాయిదా పడుతోంది. నిజానికి 'యశోద' మూవీ ప్రీమియర్‌ను ఆగస్టు 12న ప్రదర్శించాల్సి ఉంది. కానీ మేకర్స్ ఇప్పుడు మరో విడుదల తేదీ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగులో చిత్రీకరించబడగా.. డబ్బింగ్ చేసిన తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల చేసేందుకు షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. సమంతతో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, కల్పికా గణేష్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ మార్చినట్లుగా అధికారిక ప్రకటనేది వెలువడలేదు.

Advertisement

Next Story

Most Viewed