Samantha: ట్రెండింగ్‌లో సమంత బోల్డ్ వీడియో.. నాగచైతన్యను అందుకే వదిలేసిందంటూ దారుణ కామెంట్స్

by Hamsa |
Samantha: ట్రెండింగ్‌లో సమంత బోల్డ్ వీడియో.. నాగచైతన్యను అందుకే వదిలేసిందంటూ దారుణ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మయోసైటీస్ బారిన పడటంతో పూర్తిగా సినిమాలకు దూరంగా అయింది. మళ్లీ ఏడాది తర్వాత ‘సీటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇందులో వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా నటించగా.. దీనిని ‘ఫ్యామిలీ మ్యాన్-2’(Family Man-2) ఫేమ్ రాజ్ అండ్ డీకే(Raj and DK) తెరకెక్కించారు. అయితే ఈ సిరీస్ భారీ అంచనాలను నడుమ నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇందులోని పలు సీన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, సమంతకు సంబంధించిన ఓ బోల్డ్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. అందులో సమంత(Samantha), వరుణ్ ధావన్ లిప్ లాక్ ఇచ్చుకునే సీన్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ‘‘సమంతలో ఉన్న కసిని ఇండస్ట్రీలో ఏ నటిలో చూడలేదు.

ఇలాంటి సీన్స్ చేయడం కోసమే నాగచైతన్యను వదిలేసింది కావొచ్చు?’’ అని దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ లిప్ లాక్(lip lock) వీడియోను నెట్టింట షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక సమంత అభిమానులు మాత్రం ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అది ఆమె వృత్తి నటించడంలో తప్పేముంది? అని అంటున్నారు.

Advertisement

Next Story