సమంతకు అరుదైన గౌరవం.. ఆనందంలో ఫ్యాన్స్

by samatah |   ( Updated:2022-07-19 06:42:01.0  )
సమంతకు అరుదైన గౌరవం.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. స్ట్రేలియాలోని మెల్‌ బోర్న్‌ నగరంలో జరిగే ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ కు ముఖ్య అతిథిగా రమ్మంటూ ఈ అమ్మడుకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం ఆగస్టు 12 వ తేదీన జరుగనుంది. దీంతో అమ్మడు ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇక ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తార అనతి కాలంలోనే టాలీవుడ్ స్టార్ హోదా సంపాదించుకుంది. ఇక విడాకుల అనంతరం సామ్ వరస సినిమాలు చేస్తూ బీజీ అయిపోయింది. తనకు ఇలాంటి ఆహ్వానం అందడంతో భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందంటూ దీనికి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సామ్ తెలిపింది. దీంతో సమంత అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.

Advertisement

Next Story