- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదొక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అంటూ సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. దేని గురించంటే..?
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. ఇక డివోర్స్ తర్వాత సామ్.. మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్:హనీ బన్నీ’(Citadel:Honey bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సమంత రాజస్థాన్(Rajasthan)లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు దీపావళి(Diwali) సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకుంది. వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంది. ఈ క్రమంలో ఈ అమ్మడి తాజా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో సమంత ఫోర్ట్ బర్వరా(Fort Barwara)లో మట్టి కుండను తయారు చేయడం, అక్కడ పనిచేసే ఉద్యోగులతో ఫొటోలు దిగడం, వాటితో పాటు కొన్ని ప్రదేశాల పిక్స్‌ను షేర్ చేసింది. అంతే కాకుండా “నా జీవితంలో ఇవి కొన్ని సంతోషకరమైన రోజులు.. ఇప్పుడు క్రేజీ నవంబర్ కోసం సిద్ధంగా ఉన్నాను. @sixsensesfortbarwara ఎంత అందంగా ఉందో. పాత, కొత్త అందమైన కలయిక.. అద్భుతమైన అనుభవాన్ని అందించినందుకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది.
కాగా ప్రస్తుతం సమంత నటించిన 'సిటాడెల్ హనీ బన్నీ' అనే వెబ్ సిరీస్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌కు పనికొస్తుందని సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ తను ఎక్కడికి వెళ్తోంది, ఏం చేస్తోంది లాంటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటోంది సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సామ్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు.
Read More..