- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగచైతన్యపై రివెంజ్ తీర్చుకోవడం కోసం గట్టిగా ప్లాన్ చేసిన సమంత.. నెట్టింట దుమారం రేపుతున్న న్యూస్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయింది. దీంతో ఈ అమ్మడు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక హీరో అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya)తో లవ్‌లో పడి పెళ్లి(Marriage) కూడా చేసుకున్నారు. కానీ పట్టుమని నాలుగు ఏళ్లు కూడా కలిసి ఉండలేక విడాకులు(Divorce) తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల తర్వాత సామ్.. మయోసైటిక్(Myositis) అనే వ్యాధి బారిన పడి దాదాపు ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటూ హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కానీ తాజాగా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. కాగా ఈ సిరీస్ నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే.. సామ్‌తో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత(Shobhitha)తో డేటింగ్‌లో ఉంటూ ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్(Enagement) చేసుకున్నాడు. ఇక వీరి పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. డిసెంబర్‌లో ఇద్దరు ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ‘పుష్ప1’(Pushpa-1) సినిమాలో ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా అంటూ ఐటెం సాంగ్‌లో నటించి భారతదేశాన్ని ఊపేసింది సమంత. ఆ పాటలో ఈ ముద్దుగుమ్మ చేసిన డ్యాన్స్(Dance), ఆరబోసిన అందాలకు అందరూ ఫిదా అయ్యారు. ఆ సమయానికే నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. అతని మీద కోపంతోనే ఆ పాటలో నటించిందని, అంతగా అందాలు ఆరబోసిందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ‘పుష్ప 2’(Pushpa-2) సినిమాకు సంబంధించి ప్రత్యేక గీతంలో నటించేందుకు దర్శకుడు సుకుమార్(Director Sukumar) శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) చేత చేయిద్దామనుకున్నారు. చివరకు శ్రీ లీల(Sree leela)ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే అకస్మాత్తుగా సమంత పేరు వినిపిస్తోంది. ‘పుష్ప 1’ స్థాయిలో పాట రావాలంటే అదే స్థాయిలో నటించే, అదే స్థాయిలో డ్యాన్స్ చేసే సమంత అయితే బాగుంటుందనే అభిప్రాయానికి సుకుమార్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నాగచైతన్య శోభిత ధూళిపాళను వివాహం చేసుకోబోతున్నారు. ఈ పాటలో నటించడం ద్వారా అతనిపై రివెంజ్(Revange) తీసుకున్నట్లవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల చేస్తుందా లేదా సమంత చేస్తుందా అని తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వైయిట్ చేయాల్సిందే.
Read More : నాగ చైతన్య- శోభితల పెళ్లి ఎక్కడో తెలిసిపోయింది!.. ఈ స్పెషల్ ప్లేస్‌లోనే