ప్రీతమ్ నాకు డబ్బులు ఇవ్వట్లే.. సమంత సంచలన పోస్ట్

by samatah |
ప్రీతమ్ నాకు డబ్బులు ఇవ్వట్లే.. సమంత సంచలన పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత బెస్ట్ ఫ్రెండ్స్‌లో హెయిర్ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ కూడా ఒకరు. వీరిద్దరు ఎప్పుడు ఫన్నీగా ఉంటారు. ఇక నాగచైతన్యతో సామ్ విడిపోయాక ఎన్నో రూమర్స్ క్రియేట్ అయ్యాయి. జుకల్కర్ వల్లనే సామ్, చై విడిపోయారంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ సమంత జుకల్కర్ నా బెస్ట్ ఫ్రెండ్, తను నన్ను సిస్టర్ లా చూస్తాడు, అది చై‌కి కూడా తెలుసు అంటూ తెలిపింది. దీంతో రూమర్స్‌కు ఒక్కసారిగా చెక్ పడింది. కానీ విడాకుల అనంతరం సామ్‌కి జుకల్కర్ ఎంతో సపోర్టుగా ఉన్నారు. ఇక ఎప్పుడు ఫన్నీ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసే వీరు మరోసారి ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌తో అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. అదేంటి అనుకుంటున్నారా ? సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇక అక్కడే సామ్‌లతో పాటు జుకల్కర్ కూడా ఉన్నారు. కాగా, షూటింగ్ విరామ సమయంలో సమంత, ప్రీతమ్‌ మధ్య ఓ ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. దీన్ని సమంత తన ఇన్ స్టాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సామ్.. జుకల్కర్ హెయిర్ కట్ చేసింది. అంతటితో ఆగకుండా.. నేను మల్టీ టాలెండెట్, నేను హెయిర్ కట్ చేసినందుకుగాను ప్రీతమ్ నాకు డబ్బులు ఇవ్వలేదు.. తప్పకుండా మనీ ఇవ్వాల్సిందేనని కామెంట్ చేసింది. ఇక సామ్ షేర్ చేసిన వీడియో, తను చేసిన కామెంట్ ప్రస్తుంతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story