షారుఖ్‌తో రొమాన్స్ వద్దనుకున్న సమంత..

by Manoj |
షారుఖ్‌తో రొమాన్స్ వద్దనుకున్న సమంత..
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్‌లో పలు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీటౌన్‌లో తను చేయబోతున్న ప్రాజెక్ట్స్ విషయమై సోషల్ మీడియా వేదికగా భీకర చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. అట్లీ- షారుఖ్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతుండగా.. ఇందులో ముందుగా సమంతనే హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ షారుఖ్‌తో రొమాన్స్‌కు సామ్ ఒప్పుకోకపోవడంతో ఆ ప్లేస్ నయనతారకు దక్కింది.

ఆ తర్వాత సామ్.. అక్షయ్ కుమార్ లేదా సల్మాన్ ఖాన్‌తో జతకట్టనుందన్ని వార్తలు వెలువడ్డాయి. కానీ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఆయుష్మాన్ ఖురానాతో తన తదుపరి చిత్రం ఉంటుందని తెలుస్తోంది. అయితే భారీ ప్రాజెక్ట్స్ అన్నీ పక్కనబెట్టి చివరకు ఆయుష్మాన్‌తో జతకట్టడం ఏమంత గొప్ప ప్రొగ్రెస్ కాదని.. షారుఖ్ వంటి పెద్ద హీరోలతో చాన్స్ ఎందుకు వదులుకుందని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed