Samantha తో దేవరకొండ రొమాన్స్‌.. నాలుగు నెలలే సమయం

by samatah |   ( Updated:2022-04-07 04:29:30.0  )
Samantha తో దేవరకొండ రొమాన్స్‌.. నాలుగు నెలలే సమయం
X

దిశ, వెబ్‌డెస్క్ : సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన చిత్రం మహానటి. ఆ సినిమాలో వారి కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ ఫొటోగ్రాఫర్ గానూ సమంత సావిత్ర జీవితంపై రీసెర్చ్ చేసే పాత్రికుయురాలిగా కనిపిస్తూ ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే వీరి కాంబోలో సినిమా రానున్న విషయం తెలిసిందే. అయితే మజిలీ మూవీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వీరు కలిసి నటించేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా ఈ సినిమా ఓ ట్విస్ట్‌తో సెట్స్‌పైకి వెళ్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభం చేయాలని చూస్తున్నా, ఇది సెట్స్‌పైకి వెళ్లడానికి నాలుగు నెలల సమయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే సమంత తన ఓటీటీ వెబ్ సిరీస్‌ను వరుణ్ ధావన్‌తో ప్రారంభించాలని, అలాగే కొన్ని నెలల తర్వాత మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఎదురు చూస్తోంది. ఈ కారణాల వలన సామ్, విజయ్ సినిమా నిర్మించడానికి దర్శకుడు శివకు నాలుగు నెలలు సమయం మాత్రమే ఇచ్చారని టాక్.

ఇదిలా ఉంటే మణిరత్నం సూపర్‌హిట్ చిత్రం "రోజా" రీ-టెల్లింగ్, ప్రేమకథగా రానున్న ఈ చిత్రం పూర్తిగా కాశ్మీర్, మంచుతో కప్పబడిన ఇతర ప్రదేశాల్లో చిత్రీకరించబడుతుంది. అయితే పెద్ద సినిమాలకు సాధారణంగా 7-8 నెలల్లో 90-120 రోజుల షూటింగ్ తేదీలు లభిస్తాయి. కాబట్టి సినిమాను 4 నెలల్లో ముగించడం సవాలుతో కూడుకున్న విషయం. అయితే ఎలాంటి ఆప్షన్‌లు లేకపోవడంతో దర్శకుడు శివ నిర్వాణ ఈ ప్రాజెక్ట్‌ని నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story