'గాడ్ ఫాదర్' నుంచి బిగ్ అప్‌డేట్.. వారం రోజుల పాటు

by Harish |
గాడ్ ఫాదర్ నుంచి బిగ్ అప్‌డేట్.. వారం రోజుల పాటు
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. ఈ మూవీనుంచి తాజాగా బిగ్ అప్‌డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ 'లూసిఫర్'మూవీకి రీమేక్ కాగా.. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేయబోతున్నారు. అయితే రేపటినుంచి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు సల్మాన్ సెట్స్‌లోకి రాబోతున్నట్లు తెలిపిన చిత్ర బృందం.. వీరిద్దరికి సంబంధించిన ఓ కీలక సన్నివేశాన్ని ముంబైలోని 'ఎన్‌డీ' స్టూడియోస్‌లో తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ సన్నీవేశాలను వారం రోజుల పాటు చిత్రీకరించనుండగా.. షూటింగ్ పూర్తయ్యే వరకూ సల్మాన్ ఫామ్ హౌస్‌లోనే చిరంజీవి ఉంటారని తెలిపారు.

Advertisement

Next Story