Lawrence Bishnoi: బిష్ణోయ్ బెదిరింపులపై స్పందించిన సల్మాన్.. "దానికే కట్టుబడి ఉన్నా"

by Rani Yarlagadda |   ( Updated:2024-10-20 10:15:13.0  )
Lawrence Bishnoi:  బిష్ణోయ్ బెదిరింపులపై స్పందించిన సల్మాన్.. దానికే కట్టుబడి ఉన్నా
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)ను చంపేస్తామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ తరచూ బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని మరోసారి బెదిరింపులకు పాల్పడగా.. సల్మాన్ ఖాన్ కు భద్రత మరింత పెరిగింది. హిందీ బిగ్ బాస్ షో కు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. శనివారం నాటి ఎపిసోడ్ షూటింగ్ కు సల్మాన్ రాగా.. అక్కడ భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. శనివారం టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో సల్మాన్ ఇదివరకున్నంత యాక్టివ్ గా కనిపించలేదు. కంటెస్టెంట్ చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడుతూ.. తాను ఈ వారం రాకూడదనుకున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

హౌస్ లో ఉన్నవారు.. తమపట్ల మిగతా హౌస్ మేట్స్ ఎలాంటి ఫీలింగ్స్ చూపించినా పట్టించుకోకూడదన్నారు. అసలు ఈ రోజు షూటింగ్ కు రాకూడదని అనుకున్నానని, ఎవ్వరినీ కలవకూడదని భావించానని చెప్పారు. కానీ.. ఇది తన వృత్తి కాబట్టి.. దానిపట్ల ఉన్న నిబద్ధత వల్లే వచ్చానని, వృత్తి నిబద్ధతకు కట్టుబడి ఉంటానన్నారు. కాగా.. కృష్ణజింకల్ని వేటాడిన కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని కొన్నిసంవత్సరాలుగా బెదిరిస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని కూడా ఆ గ్యాంగ్ సభ్యులు చంపేశారు.

Advertisement

Next Story

Most Viewed