సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ రిపోర్ట్స్‌పై సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో ప్రేయసి

by Anjali |   ( Updated:2024-11-06 11:12:11.0  )
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ రిపోర్ట్స్‌పై సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో ప్రేయసి
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత నటుడు సుశాంత్ సింగ్ (Sushant Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 1998 లో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ‘సత్య’(satya) చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకుల మెప్పు పొందాడు. తర్వాత పలు చిత్రాల్లో నటించాడు. ఏమైందో తెలియదు కానీ సుశాంత్ 2020 జూన్ 14 వ తేదీన బాంద్రా(Bandra)లో తన అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూమ్ లో ఉరివేసుకుని మరణించాడు. ఇప్పటికీ సుశాంత్ ది హత్యా? లేక ఆత్మహత్యా? అనేది క్లారిటీ లేదు. ఈ నటుడు చనిపోయి నాలుగేళ్లు అవుతోన్న దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) మాజీ ప్రియురాలు సోమీ అలీ(Somi Ali) సుశాంత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ ఎలా మరణించాడని చెప్పుకొచ్చింది. అంతా ఈ నటుడిది ఆత్మహత్య అంటున్నారని.. కానీ నిజానికి అతడిని హత్య చేశారని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా హత్య అని వచ్చింది. కానీ ఆసుపత్రి సిబ్బంది దాన్ని ఆత్మహత్యగా మార్చేశారని సోమీ అలీ వెల్లడించింది. అసలు పోస్టుమార్టం నివేదికలో డాక్టర్ ఏముందని అన్నారని.. ఒకసారి ఆయన్ను అడగండి అంటూ సల్మాన్ మాజీ ప్రేయసి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Read More..

Chiranjeevi: మెగాస్టార్ సగం తాగిన టీ కప్పు తీసుకున్న కమెడియన్.. లక్ష రూపాయలిచ్చిన ఇవ్వనంటూ...

Advertisement

Next Story