- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోనమెత్తిన హైబ్రిడ్ పిల్ల.. కన్నుల పండగలా ఉందంటున్న ఫ్యాన్స్
దిశ, సినిమా : హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి ఉజ్జయినీ మహంకాళి బోనమొత్తి ఆశ్చర్యపరిచింది. పక్కా తెలంగాణ సంప్రదాయంలో లంగావోణి ధరించడమే కాక కాళ్లకు పసుపు, చెంపలకు గంధం, కొప్పులో కనకాంబరాలు పెట్టుకుని మైమరపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ తెగ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్‌తో పాటు జనాలు కూడా ఫిదా అవుతున్నారు. విషయానికొస్తే.. యంగ్ డైరెక్టర్ వేణు ఉడుగుల తెలంగాణ ముఖచిత్రాన్ని 'విరాటపర్వం' చిత్రంలో కండ్లకు కట్టినట్లుగా చూపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి బోనం ఎత్తుకున్న ఫొటోను ఈ రోజు బోనాల పండగ సందర్భంగా షేర్ చేశాడు. 'గ్రామీణ జీవన సంస్కృతికి, ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక!' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. 'కన్నుల పండుగగా ఉందంటూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్.
గ్రామీణ జీవన సంస్కృతికి,ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక!#Happybonam pic.twitter.com/wSVxr0yvJj
— v e n u u d u g u l a (@venuudugulafilm) July 24, 2022