థియేటర్‌‌లో సాయి పల్లవి సందడి.. వైరల్ వీడియో

by Mahesh |
థియేటర్‌‌లో సాయి పల్లవి సందడి.. వైరల్ వీడియో
X

దిశ, సినిమా: సాయి పల్లవి మెయిన్ లీడ్‌గా నటించిన 'గార్గి' చిత్రం ఇటీవలే విడుదలైంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఒక గ్యాంగ్ రేప్ కేసులో అన్యాయంగా ఇరుక్కున్న తండ్రిని విడిపించేందుకు కూతురు చేసే న్యాయ పోరాటాన్ని చూపించారు. ఈ మూవీకి ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తుండగా.. హీరోయిన్ సాయి పల్లవి ఆదివారం చెన్నైలోని కొన్ని థియేటర్లను సందర్శించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో ఆమెను గుర్తించిన ప్రేక్షకులు సాయి పల్లవిని చప్పట్లతో అభినందిస్తూ ఉత్సాహపరిచారు. ఇక తను కూడా ఓపికగా చాలా మందితో సెల్ఫీలు దిగింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. తనలోని ఓర్పు, సహనమే ఇంత మంచి గుర్తింపు తీసుకొచ్చాయంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story