Telangana News:పెళ్లి చేసుకునే వారికి గుడ్ న్యూస్.. RTC MD సజ్జనార్ బంపర్ ఆఫర్

by samatah |   ( Updated:2022-04-12 10:36:32.0  )
Telangana News:పెళ్లి చేసుకునే వారికి గుడ్ న్యూస్.. RTC MD సజ్జనార్ బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్ : టీఎస్ ఆర్టీసీలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ నియామకం అయినప్పటి నుంచి.. టీఎస్ ఆర్టీసీ లాభాల బాట పట్టించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ‌పై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు మహిళల కోసం, విద్యార్థుల కోసం స్పెషల్ ఆఫర్స్, వృద్ధులకు ఉచిత ప్రయాణం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా పెళ్లి చేసుకునే వారికి సజ్జనార్ తీపి కబురు అందించాడు. పెళ్లీలు, ఇతర శుభకార్యాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్ తెలిపారు. శుభకార్యానికి ఒక నెల ముందు 'టీఎస్ ఆర్టీసీ' బుక్ చేసుకుంటే వారికి 20 శాతం తగ్గింపు కలదని, సాధారణ చార్జీలకంటే 15 శాతం తగ్గింపు లభిస్తుందని తెలిపారు.

Advertisement

Next Story