- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ జాతరకు వెళ్లకుండానే ప్రసాదం డోర్ డెలివరీ.. ఎలా పొందొచ్చంటే..?
దిశ, సంగారెడ్డి: మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అక్కడికి వెళ్లకుండానే అమ్మవారికి బంగారం మొక్కులు చెల్లించుకుని అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా భక్తులు అమ్మవారికి చెల్లించే బంగారం మొక్కులు చెల్లించుకోవడం తిరిగి అక్కడి నుంచి అమ్మ వారి ప్రసాదం కుంకుమ, పసుపు తీసుకువచ్చి మొక్కులు చెల్లించుకున్న భక్తులకు ఆర్టీసీ అందించనుంది.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా 200 కిలోమీటర్ల వరకు రూ. 400 ఆపై కిలో మీటర్లకు రూ.450 ధరను నిర్ణయించారు. భక్తులు కేటాయించిన ధరలో 5 కిలోల వరకు బంగారం పంపించే వెసులుబాటు కల్పించారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని బస్ డిపోల నుంచి భక్తులు మేడారం అమ్మవారికి పంపించే బెల్లం మొక్కులు వరంగల్ వరకు కార్గో సర్వీసుల ద్వారా పంపించి.. అక్కడి నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీం ల ద్వారా సమ్మక్క సారలమ్మలకు చేరవేస్తారు.
భక్తులు సద్వినియోగం చేసుకోవాలి.. సంగారెడ్డి డిపో మేనేజర్ నాగభూషణం
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ల సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా మేడారం జాతరకు వెళ్లకుండానే అమ్మవారికి బంగారం మొక్కులు చెల్లించుకుని అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని తమ ఇంటి వద్ద నుంచే మొక్కులు చెల్లించుకోవచ్చు. ఆర్టీసీ నిర్ణయించిన ధరల ప్రకారం 200 కిలోమీటర్ల వరకు రూ. 400 రూపాయలు ఆపై కిలో మీటర్లకు రూ.450 రూపాయల నిర్ణయించింది. ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలకే తమ మొక్కులు చెల్లించుకోవడానికి ఇదో సదవకాశం దీనిని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలి.