శరణ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆర్‌ఎస్పీ

by S Gopi |
శరణ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆర్‌ఎస్పీ
X

దిశ, దంతాలపల్లి: ప్రేమించి మోసపోయానంటూ మండలంలోని పెద్దముప్పారం గ్రాముములో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న శరణ్య కుటుంబాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ప్రేమ పేరుతో మోసాలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తే ఇటువంటివి మళ్ళీ పునవృతమ కావడమే కాకుండా మహిళలకు తగిన భద్రత ఉంటుందన్నారు. శరణ్య మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించడమే కాకుండా గడిలా పంచాయతీ పెట్టి విషయన్నీ బయటికి పొక్కకుండా దబాయించిన పెద్దమనుషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి బీఎస్పీ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని మనోధైర్యం కల్పించారు.

Advertisement

Next Story