- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RS Praveen Kumar: చేవెళ్ల బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..?
దిశ, చేవెళ్ల : RS Praveen Kumar is Said to Contesting From BSP In Chevvella Constituency| చేవెళ్ల నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు అత్యంత సన్నిహితులు స్వేరో ప్రధాన కార్యాలయంలో నుంచి సమాచారం తెలుస్తుంది. బీఎస్పీ పార్టీని గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ఒక్కసారిగా చేవెళ్ల గడ్డపై జెండా ఎగురవేస్తాం అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన అత్యున్నత పదవిని ఐపీఎస్ ఉద్యోగాన్ని త్యాగం చేసి, పేద బిడ్డల కొరకు గురుకులాలను ఎన్నుకొని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, లక్షలాది మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలను ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో చదివించారు. చేవెళ్ల ఎస్సీ నియోజకవర్గం కావడం హైదరాబాద్‌కి దగ్గరగా ఉండటం, మిగతా పార్టీలపైనా వ్యతిరేకత ఎక్కువగా ఉండటం.. బహుజన సమాజ్ పార్టీకి బాగా కలిసి వచ్చే అంశం.
పీకే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేవెళ్లలో గెలుస్తాడు అని రిపోర్ట్ ఇచ్చినట్టు టీఆర్‌ఎస్ శ్రేణుల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26న రాజ్యాధికార యాత్ర విజయోత్సవ సభలో ఒక్క రూపాయి ఇవ్వకుండా.. లక్ష ఎనభై వేల మంది జనం సభకు హాజరు కావడంతో అధికార ప్రతిపక్ష పార్టీల్లో కలవరం మొదలైంది. ప్రతి దళిత కుటుంబాలలో మహనీయుల ఫొటోలోతో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోటో కూడా పెట్టుకునేంత చరిష్మా వున్నా నాయకుడు. మా చేవెళ్లకు రావడం గొప్ప అదృష్టం అని అధికార, ప్రతిపక్ష నాయకులు కూడా అంగీకరిస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా బహుజనులు అంతా ఏకమై బహుజన రాజ్యాధికారం సాధిస్తారని ప్రజల్లో బలమైన చర్చ జరుగుతుంది.