Alia Bhatt: అలియా పెళ్లికి హాజరు కానీ RRR టీమ్.. ఆ విషయంలో హర్ట్ అయ్యారా ?

by samatah |   ( Updated:2022-04-16 07:26:09.0  )
Alia Bhatt: అలియా పెళ్లికి హాజరు కానీ RRR టీమ్.. ఆ విషయంలో హర్ట్ అయ్యారా ?
X

దిశ, వెబ్ డెస్క్ : అలియా రణబీర్ లవ్ బర్డ్స్.. ఎట్టకేలకు ఏప్రిల్ 14న మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే పెళ్లికి ముందు RRR మూవీ‌తో మంచి బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకుంది అలియా. కానీ, ఈ ముద్దు గుమ్మకు RRR టీమ్ నుంచి ఎలాంటి వివాహ శుభాకాంక్షలు అందలేదు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. RRR మూవీలో అలియాకు ఎక్కువగా స్రీన్ స్పేస్ ఇవ్వకపోవడంతో ఈ అమ్మడు కాస్త అసహనానికి గురైనట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ నుంచి సినిమాకు సంబంధించిన కొన్ని పోస్ట్‌లను తొలగించింది. అలాగే తన ఇన్‌స్టాగ్రామ్‌లో SS రాజమౌళిని అన్‌ఫాలో చేసిందనే పుకారు ఉంది. కానీ RRR' ప్రమోషనల్ క్యాంపెయిన్ రెండవ దశ సమయంలో అలియా కోపంగా ఉందని గాసిప్స్ వచ్చాయి. కాగా, దీనిపై అలియా స్పందిస్తూ.. త్రిబుల్ ఆర్ టీం వలన తను బాధ పడలేదని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలిపింది. ఇక RRR టీమ్ అలియా భట్, రణబీర్ కపూర్ వివాహానికి హాజరు కావడానికి చార్టర్ ఫ్లైట్‌ను అద్దెకు తీసుకున్నట్లు ఇటీవల ఓ వార్త వినిపించింది. కానీ, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ అలియా పెళ్లికి హాజరు కాలేదు, అలాగే కనీసం సోషల్ మీడియాలో ఆమెకు వివాహ శుభాకాంక్షలు కూడా తెలపలేదు. ఈ విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు చర్చలు నడుస్తున్నాయి.

Advertisement

Next Story