కడ్డీల మధ్యలో ఇరుక్కున పిల్లాడు..ఏం చేశాడో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

by Nagaya |   ( Updated:2023-11-05 15:21:25.0  )
కడ్డీల మధ్యలో ఇరుక్కున పిల్లాడు..ఏం చేశాడో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
X

దిశ,వెబ్‌డెస్క్: చిన్న పిల్లలు ఎప్పుడూ ఆటలు ఆడుకుంటూ అటూ ఇటూ తిరుగుతారు ఒక్క తాన సరిగ్గా ఉండరు. ఆడుకుంటూ కొన్ని కొంటె పనులు చేస్తూ తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు తింటారు. పిల్లలు ఏదో ఒక సందులో దూరి ఆడుతుంటారు.. ఏదైనా వస్తువులు కనపడితే దాన్ని పట్టుకుని ఆడుకుంటుంటారు..ఇలా ఆడుకుంటూ పిల్లలు బకెట్ ల్లో ఇతర వాటిలో ఇరుక్కోవటం తరచూ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సంఘటన జరిగిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఫెన్సింగ్ లాంటి ఇనుపకడ్డీ లో తల ఇరుక్కుంది. ఇదిగమనించిన వాళ్ల తండ్రి తలను బయటకు తీయడానికి కడ్డీల మధ్య గ్యాప్ పెంచడానికి కాళ్ళతో వంచటం లాంటివి శత విధాలుగా ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం లభించలేదు. చివరికి పిల్లాడు ఎలాంటి భయబ్రాంతులకు లోనవకుండా ప్రశాంతంగా ఆలోచించి. తాను ఎలా ఇరుక్కున్నాడో.. ఆలోచించి అలా ప్రయత్నం చేయసాగాడు..మొదటగా తల తీదాం అనుకున్నా ఆ పని కాలేదు దీంతో మెల్లగా ఒక సైడ్ నుంచి చేతులు పెట్టి జాగ్రత్తగా బయటకు వచ్చాడు..ఇది చూసిన వారు పిల్లాడి తెలివికి ఫిదా అవుతున్నారు. పలువులు నెటిజన్లు పిల్లాడిని అప్రిషియేట్ చేస్తుంటే మరికొందరూ పిల్లాడు ఇబ్బందిలో ఉన్నప్పుడు వీడియోలు తీయటం ఏంటి అని తల్లిదండ్రులను తిడుతున్నారు. మరో నెటిజన్ ఇది టిక్‌టాక్ లాంటి ఫేమస్ కావడానికి తీసిన వీడియో అని కామెట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed