ఘోర రోడ్డు ప్రమాదం: మానవత్వం చాటుకున్న మంత్రి గంగుల కమలాకర్

by Web Desk |
ఘోర రోడ్డు ప్రమాదం: మానవత్వం చాటుకున్న మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట శివారులో కారు అదుపుతప్పి ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. డీ వైడర్ డీ కొన్న ఘటనలో భాస్కర్, అమర్ష్, తిరుమల, మౌనిక తో పాటు డ్రైవర్ మొత్తం 5 గురు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ పట్టణానికి చెందిన వీరు కరీంనగర్ లో ఓ వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో స్విఫ్ట్ డిజైర్ కారును నడుపుతున్న వ్యక్తి అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.




అదే మార్గం గుండా హైదరాబాద్ వెళ్తున్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఘటనను చూసి వెంటనే కారు అపారు. కారు ప్రమాదంలో గాయపడిన వారిని చూసి హుటాహుటిన స్పందించి స్థానికుల సహాయంతో వారిని తన కారులో తన వ్యక్తిగత సిబ్బందిని తోడుగా పంపారు. సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు మెరుగైన వైద్యం కోసం పంపించారు. అక్కడి డాక్టర్‌లోతో మాట్లాడి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. కారు ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కారులో ఇరుక్కుపోవడంతో జెసిబి సహాయంతో బయటకు తీశారు

Advertisement

Next Story