- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
దిశ, ఏపీ బ్యూరో : నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని దామరమడుగు సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా తీవ్రగాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే బుధవారం ఉదయం 36 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు నెల్లూరు వెళ్తోంది. అయితే బుచ్చి మండలం దామరమడుగు మఠం వద్ద బస్సు అదుపు తప్పింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బస్సు పక్కనే ఉన్న పొలాల్లోకి పల్టీ కొట్టింది. బస్సు రెండుసార్లు పల్టీలు కొట్టడంతో ప్రయాణికులంతా తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా రక్షించండి అంటూ అరుపులు, కేకలు వేశారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా భీతిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు 108 సిబ్బంది ప్రమాద స్థలంలో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఒక మహిళ చనిపోగా మరో నలుగురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.