Rashmika: నేషనల్ క్రష్ క్రేజ్.. విజయ్‌ వల్లేనా? రష్మిక ఏం చెబుతోంది

by samatah |   ( Updated:2022-04-05 09:25:09.0  )
Rashmika: నేషనల్ క్రష్ క్రేజ్.. విజయ్‌ వల్లేనా? రష్మిక ఏం చెబుతోంది
X

దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందన్న నేడు 26వ వసంతంలోకి అడుగుపెట్టింది. కన్నడలో 'కిరిక్ పార్టీ' మూవీతో పరిచయమైన బ్యూటీ.. ఆ సినిమా సక్సెస్‌తో వరుస ఆఫర్లు దక్కించుకుంది. తెలుగులో 'ఛలో' సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినప్పటికీ విజయ్ దేవరకొండతో నటించిన 'గీత గోవిందం'తో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఈ సినిమా రష్మికను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. విజయ్‌తో ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌కు మంచి క్రేజ్ ఏర్పడటంతో 'డియర్ కామ్రేడ్'తో మరోసారి జత కట్టారు. ఇక ఆ వెంటనే మహేశ్ బాబుతో నటించిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ రష్మిక క్రేజ్‌ను రెట్టింపు చేసింది. ఇందులో ఆమె డ్యాన్స్, డైలాగ్స్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ యూత్ ఆడియన్స్‌ను కట్టిపడేశాయి. ఇదేక్రమంలో కోలీవుడ్‌లో 'సుల్తాన్' మూవీతో అలరించిన భామ.. 'పుష్ప' మూవీలో నేచురల్‌ యాక్టింగ్‌తో మాయ చేసింది. ఈ చిత్రంలోని 'సామి సామి' పాటతో సోషల్ మీడియాను షేక్ చేసి నేషనల్ క్రష్‌ బిరుదును సార్థకం చేసుకుంది.

ఈ మేరకు చిత్ర పరిశ్రమలో తన ఎనిమిదేళ్ల ప్రయాణం గురించి మాట్లాడిన రష్మిక.. ప్రేక్షకుల ప్రేమ, అభిమానాలే తనను ముందుకు నడిస్తున్నాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం 'మిషన్ మజ్ను' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్న డియర్ లిల్లీ.. 'గుడ్ బై' సినిమాలో అమితాబ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. ఇవే కాక సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' ప్రాజెక్ట్‌లో రణ్‌బీర్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది.

Advertisement

Next Story