CM Revanth Reddy: సొంతూరు ప్రజలతో రేవంత్ దసరా సెలబ్రేషన్స్.. ‘గేమ్ ఛేంజర్’ సాంగ్‌తో వీడియో షేర్ చేసిన CM

by Anjali |
CM Revanth Reddy: సొంతూరు ప్రజలతో రేవంత్ దసరా సెలబ్రేషన్స్..  ‘గేమ్ ఛేంజర్’  సాంగ్‌తో వీడియో షేర్ చేసిన CM
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది (2024) దసరా పండుగ సెలబ్రేషన్స్ తన సొంతూరులో జరుపుకున్నారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి. కాగా రేవంత్ రెడ్డి ఈసారి సన్నిహితులతో, బంధువులతో కుటుంబీకులతో, గ్రామ ప్రజలతో కలిసి దసరాను ఘనంగా జరుపుకున్నారు. ఊరి ప్రజలతో మన సీఎం పలు కార్యక్రమాల్లో పాల్గొని సరదాగా గడిపారు. రేవంత్ సొంతూరు ప్రజలతో సెలబ్రేట్ చేసుకొన్న దసరా సెలబ్రేషన్స్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి నెట్టింట షేర్ చేసిన వీడియోకు మెగా హీరో గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలోని ‘రా మచ్చ రా మచ్చ’ పాటను యాడ్ చేసి పంచుకున్నారు. దీంతో మెగా హీరో రామ్ చరణ్ అభిమానులు రేవంత్ షేర్ చేసిన వీడియోను నెట్టింట తెగ వైరల్ చేస్తూ హ్యాపీ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వీడియోకు.. ‘గంటలు క్షణాల్లా గడిచిపోయాయి. అనుబంధాలు శాశ్వతమై మిగిలాయి. కొండారెడ్డిపల్లిలో ఈ దసరా నా జీవన ప్రస్థానంలో ఆత్మీయ అధ్యాయ’. అంటూ క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Advertisement

Next Story