- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పుష్ప 2’ వాయిదా పై స్పందించిన మేకర్స్.. ఆ వీడియోను షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చేశారుగా..
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప 2’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇండియాస్ ఫేమస్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిని లవర్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఓ స్పెషల్‌గా సాంగ్‌లో మెరవబోతోంది. ఇక ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్స్ ఇప్పటికే ఐకాన్‌స్టార్ అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది.
ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన బిగ్గెస్ట్ ట్రైలర్ ఈవెంట్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ ట్రైలర్‌తో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈ సినిమా వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీనిపై మేకర్స్ స్పందిచారు. పుష్ప2 వాయిదా అంటూ వస్తున్న రూమర్స్‌ను తెరదించేలా మేకర్స్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. పుష్ప మూవీలో అల్లు అర్జున్ మేనరిజం వీడియోను షేర్ చేసి.. ‘డిసెంబర్ 5.. అస్సలు తగ్గేదేలే’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అనుకున్న తేదీకే మూవీ రానున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అలాగే USA ప్రీమియర్స్ డిసెంబర్ 4న పడతాయని మేకర్స్ తెలిపారు.
Read More...
‘పుష్ప 2’ వాయిదా పై స్పందించిన మేకర్స్.. ఆ వీడియోను షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చేశారుగా..