- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియతమా నేనిచట కుశలమే నీవచట కుశలమా.. లవ్ సాంగ్‌తో ఆ ఫొటో షేర్ చేసిన రేణుదేశాయ్.. (పోస్ట్)
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈక్రమంలో దాదాపు ఏడాది తర్వాత షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు పోస్ట్ ద్వారా వెల్లడించింది.
అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా, రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన ఫొటోను షేర్ చేస్తూ.. ‘ప్రియతమా నేనిచట కుశలమే నీ వచట కుశలమా’ అనే లవ్ సాంగ్‌ను యాడ్ చేసింది. అంతేకాకుండా ‘అది నా నీడగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు సంచారి అండ్ ఆ నీడ గురించి ఏదైనా విన్నారా’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.