Renu Desai: కొత్త జర్నీ స్టార్ట్ చేశా నాకు సపోర్ట్ చేయండి.. రేణు దేశాయ్ పోస్ట్‌తో షాక్‌లో నెటిజన్లు

by Hamsa |   ( Updated:2024-10-26 14:28:14.0  )
Renu Desai: కొత్త జర్నీ స్టార్ట్ చేశా నాకు సపోర్ట్ చేయండి.. రేణు దేశాయ్ పోస్ట్‌తో షాక్‌లో నెటిజన్లు
X

దిశ, సినిమా: పవన్ కల్యాణ్ మాజీ భార్య, టాలీవుడ్ నటి రేణు దేశాయ్(Renu Desai) నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. జంతువులకు సాయం చేయడంతో పాటు ఫాలోవర్స్‌ను కూడా విరాళం అడిగి వాటిని ఆదుకుంటుంది. అలాగే తన కెరీర్, వ్యక్తిగత విషయాలను నెట్టింట పెడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా, రేణు దేశాయ్(Renu Desai) కొత్త జర్నీ స్టార్ట్ చేశానంటూ ఇన్‌స్టా్గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. ‘‘ఈ రోజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియోను షేర్ చేస్తున్నాను.

ఎన్నో ఏళ్ల నుంచి ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. చిన్నతనం నుంచి మూగ జీవాలను సంరక్షించడం నాకు ఇష్టం. ఎన్నో సార్లు నా వంతు ప్రయత్నం చేశా. మూగ జీవాల కోసం నా గళాన్ని వినిపించాలని.. వాటి రక్షణ కోసం ఇంకా ఏదైనా చేయాలని కొవిడ్ సమయంలో నిర్ణయించుకున్నా. ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించాను. ఇన్నాళ్లకు నా సొంత ఎన్జీవో(NGO)ను రిజిస్టర్ చేయించాను. అన్ని నా పాకెట్‌లోంచి పెడతాను.

నా సొంతంగా అంబులెన్స్, బ్యాంక్ అకౌంట్‌ను సంపాదించాను. నన్ను నమ్మి నా కొత్త జర్నీకి సపోర్ట్ చేయండి. ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’(Sri Adya Animal Shelter) అని ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేశాను. పేజ్‌ను ఫాలో అవండి. అయితే అందరికీ నేనొక రిక్వెస్ట్ చేస్తున్నాను. రూ. 500 అయినా సరే డొనేట్ చేయండి. నెలకు కనీసం రూ. 100 అయిన విరాళం ఇవ్వండి అది నాకు పెద్ద సహాయం. మీరు ఇచ్చిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోదు. నేను నా సొంత డబ్బుతో హాస్పిటల్ కట్టిస్తాను. కానీ కొంత సమయం పడుతుంది’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు కంగ్రాట్స్ చెబుతుంటే.. మరికొందరు డబ్బులు లేవని ఇన్నాళ్లు విరాళాలు అడిగి ఇప్పుడు ఎన్జీవో స్టార్ట్ చేయడం ఏంటని షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story