Renu Desai : చండీ హోమం చేసిన రేణు దేశాయ్

by M.Rajitha |   ( Updated:2024-10-19 11:56:13.0  )
Renu Desai : చండీ హోమం చేసిన రేణు దేశాయ్
X

దిశ, వెబ్ డెస్క్ : నటి రేణూ దేశాయ్(Renu Desai) తన నివాసంలో చండీ హోమం నిర్వహించారు. శరద్ పూర్ణిమ సందర్భంగా రేణూ ఈ పూజ నిర్వహించగా.. ఆమె తనయుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు. ఈ హోమానికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో రేణూ దేశాయ్ పోస్ట్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో సంచలనంగా మారింది. మన సంస్కృతి గొప్పతనాన్ని మన పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత మనదే అని పేర్కొన్నారు. "శరద్ పూర్ణిమ సందర్భంగా గణపతి, చండీహోమం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించాము. మన సాంప్రదాయలు, ఆచారాలను పిల్లలకు నేర్పించాలి. పూజ సమయంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా, ప్రశాంతంగా భక్తి మీదనే దృష్టి పెట్టాలి." అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.

Advertisement

Next Story