- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రముఖ ఇన్నర్‌వేర్ బ్రాండ్ క్లోవియాలో 89 శాతం వాటాను కొనుగోలు చేసిన రిలయన్స్ రిటైల్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఇన్నర్‌వేర్ బ్రాండ్ క్లోవియా కలిగిన పర్పుల్ పాండా ఫ్యాషన్ లిమిటెడ్‌లో దేశీయ రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ 89 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. దీనికోసం రిలయన్స్ రిటైల్ సంస్థ రూ. 950 కోట్లను చెల్లించినట్టు పేర్కొంది. ఈ ఒప్పందం అనంతరం వ్యవస్థాపక బృందంతో పాటు నిర్వహణ బృందం కంపెనీలోని మిగిలిన వాటాను సమానంగా కలిగి ఉంటాయని రిలయన్స్ సంస్థ వివరించింది. 2013లో పంకజ్ వర్మనీ, నేహా కాంత్, సుమర్ చౌదరీలు కలిసి క్లోవియా బ్రాండ్‌ను స్థాపించారు.
క్లోవియా ప్రధానంగా భారత్‌లోని మిలీనియల్ ఉమెన్ నుంచి మంచి ఆదరణ సంపాదించిన ఇన్నర్‌వేర్ బ్రాండ్‌గా నిలిచిందని రిలయన్స్ రిటైల్ తెలిపింది. గత తొమ్మిదేళ్లుగా క్లోవియా బ్రాండ్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తోంది. అంతేకాకుండా కొత్త తరానికి అనువైన డిజైన్‌తో పాటు సరసరమైన ధరల్లో, ఆఫర్లను సైతం ఇస్తోందని కంపెనీ పేర్కొంది. క్లోవియా మొత్తం 3,500 ఉత్పత్తులను కలిగి ఉందని వెల్లడించింది.