రష్యా నుంచి చమురు కొనేందుకు నిరాకరించిన రిలయన్స్!

by Harish |   ( Updated:2022-03-17 14:47:16.0  )
రష్యా నుంచి చమురు కొనేందుకు నిరాకరించిన రిలయన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద రిఫైనరీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో రిలయన్స్ రష్యాకు చెందిన చమురును కొనుగోలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. రష్యా నుంచి చమురును తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆంక్షల వల్ల కొనుగోలు ప్రక్రియను తిరస్కరించే వెసులుబాటు తమకుందని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ రావత్‌ అన్నారు.

ప్రస్తుతం రిలయన్స్‌ సంస్థ తన రిఫైనరీల కోసం రష్యా ఉరల్స్‌ ముడిచమురును నేరుగానే కొనుగోలు చేస్తోంది. అలాగే, రిఫైనరీలో ఎక్కువగా మిడిల్‌ ఈస్ట్‌, అమెరికా నుంచి సేకరిస్తోంది. గత నెల నుంచి ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి దిగడం వల్ల చమురు దిగుమతులపై అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే రష్యా భారత్‌కు తక్కువ ధరకే చమురును సరఫరా చేసేందుకు సిద్ధమైంది. దీంతో భారత్ 30 లక్షల బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. యుద్ధ పరిస్థితులు మొదలైన తర్వాత ముడి చమురు కొనుగోలుకు సంబంధించి అతిపెద్ద లావాదేవి ఇదే కావడం గమనార్హం. అయితే, వివిధ కారణాల వల్ల రష్యా చమురును కొనేందుకు రిలయన్స్ సంస్థ దూరంగా ఉండనున్నట్టు స్పష్టం చేసింది.

Advertisement

Next Story