12th gen ఇంటెల్ కోర్ i7ప్రాసెసర్‌‌తో Redmi కొత్త ల్యాప్‌టాప్

by Harish |
12th gen ఇంటెల్ కోర్ i7ప్రాసెసర్‌‌తో Redmi కొత్త ల్యాప్‌టాప్
X

దిశ,వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Redmi కొత్తగా ల్యాప్‌టాప్ లాంచ్ చేసింది. కొత్త RedmiBook Pro 15 ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. Windows 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌‌తో వస్తుంది.

స్పెసిఫికేషన్‌లు

RedmiBook Pro 15 (2022) Windows 11 తో వస్తుంది. 3,200x2,000 పిక్సెల్‌ల రిజల్యూషన్, 16:10 యాస్పెక్ట్ రేషియో, 400 nits, 100 శాతం sRGB కలర్‌తో 15.6-అంగుళాల IPS స్క్రీన్‌ను కలిగి ఉంది.12th gen ఇంటెల్ కోర్ i7-12650H, 12th gen ఇంటెల్ కోర్ i5-12450H ప్రాసెసర్‌లతో పాటు NVIDIA GeForce RTX 2050 లేదా Intel Core i50HD ని కలిగి ఉంటుంది.

ల్యాప్‌టాప్ మొత్తం మూడు వేరియంట్‌లు 5,200MHz ఫ్రీక్వెన్సీతో 16GB LPDDR5 RAM తో వస్తున్నాయి. అదనంగా ల్యాప్‌టాప్ 512GB హై-స్పీడ్ స్టోరేజ్‌ని కలిగి ఉంది. ల్యాప్‌టాప్ డ్యూయల్ 4K వీడియో అవుట్‌పుట్ లేదా సింగిల్ 8K వీడియో అవుట్‌పుట్‌కు సపోర్ట్ కోసం థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌తో వస్తుంది. బ్లూటూత్ v5.2, 5GHz డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 6 కి కూడా సపోర్ట్ చేస్తుంది. ల్యాప్‌టాప్ 72Whr బ్యాటరీని, ఒకే చార్జ్‌పై గరిష్టంగా 12 గంటల లైఫ్‌ను అందస్తోంది. దీని బరువు 1.8kg. ట్రావెల్ మైలార్ టచ్‌ప్యాడ్, పవర్ బటన్‌పై వేలిముద్ర స్కానర్‌ను కలిగి ఉంది.

Intel UHD గ్రాఫిక్స్‌తో 12th gen ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ ధర రూ. 67,000 నుంచి ప్రారంభమవుతుంది. Nvidia GeForce RTX 2050 GPU తో పాటు 12th gen ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో కూడిన ల్యాప్‌టాప్ ధర రూ. 89,780. ల్యాప్‌టాప్ మార్చి 24 నుండి అమ్మకానికి ఉంటుంది.

Advertisement

Next Story