- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna: రణ్‌బీర్ కపూర్‌తో రొమాన్స్..!
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన అందం, అభినయం, క్యూట్ నెస్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్‌ల సరసన నటించి.. స్టార్ హీరోయిన్ స్టేటస్‌తో దూసుకుపోతోంది ఈ కన్నడ భామ. తాజాగా ఈ హాట్ బ్యూటీ నటించిన పుష్ప చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం పుష్ప పార్ట్ 2లో మరోసారి శ్రీవల్లీగా సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది ఈ హాట్ బ్యూటీ. అయితే రష్మిక.. టాలీవుడ్లో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్లో పాగ వేసేందుకు ప్లాన్ చేస్తోంది.
ఇప్పటికే బాలీవుడ్‌కు ఇంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ గురించి బీ టౌన్లో మరోవార్త చెక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ లవర్ బాయ్, అలియాభట్ ప్రియుడు రణ్ బీర్ కపూర్‌తో.. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ సినిమా తెరకెక్కించేందకు రెఢీ అవుతున్నట్లు టాక్. అయితే ఈ చిత్రంలో రణ్ బీర్ పక్కన హీరోయిన్గా నటించేందుకు రష్మికను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మూవీలో రష్మిక.. రణబీర్ వైఫ్ క్యారెక్టర్లో నటించనుందని.. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, కెమిస్ట్రీ కూడా బాగుంటుందని చిత్రబృందం భావిస్తోన్నట్లు సమాచారం.