ప్రభుత్వ ఆసుపత్రులకు డీహెచ్​ కీలక ఆదేశం..

by Satheesh |   ( Updated:2022-03-30 15:44:06.0  )
ప్రభుత్వ ఆసుపత్రులకు డీహెచ్​ కీలక ఆదేశం..
X

దిశ, తెలంగాణ బ్యూరో: వడదెబ్బ బాధితులకు వేగంగా వైద్యం అందించేందుకు అన్ని జిల్లాల్లో ర్యాపిడ్​టీమ్‌లను ఏర్పాటు చేయాలని వైద్యశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు హెల్త్ డైరెక్టర్​శ్రీనివాసరావు అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్, జిల్లా ఆసుపత్రుల వరకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ కేంద్రంలో తప్పనిసరిగా ఓఆర్‌ఎస్, ఐవీ ప్లూయిడ్స్‌ను స్టాక్​పెట్టుకోవాలన్నారు.

దీంతో పాటు వడదెబ్బపై అవగాహన క్యాంపులు ఏర్పాటు చేయాలని, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మార్కెట్లు, షాపింగ్​ మాల్స్, బస్, రైల్వేస్టేషన్లలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు వడదెబ్బ కేసులపై ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకల్లా కోఠిలోని ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు. గర్భిణులు, పిల్లలు, వృద్దులు త్వరగా ఎండదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నదని, ఆ కేటగిరీపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఎండదెబ్బ తగిలినప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు, అందించాల్సిన చికిత్సపై వైద్యారోగ్యశాఖ సిబ్బందికి ఎప్పటికప్పుడు ట్రైనింగ్​ ఇవ్వాలలన్నారు. గ్రామ స్థాయిలోని వివిధ ప్రభుత్వ విభాగాల ఉద్యోగులతో సమన్వయమై ప్రజలను రక్షించే చర్యలు చేపట్టాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed