ఇండస్ట్రీలో మోసగాడిగా ముద్ర వేశారు.. రక్తం మరిగిందంటున్న స్టార్ హీరో

by S Gopi |
ఇండస్ట్రీలో మోసగాడిగా ముద్ర వేశారు.. రక్తం మరిగిందంటున్న స్టార్ హీరో
X

దిశ, సినిమా : రణబీర్ కపూర్ తన వ్యక్తిగత విషయాలు పబ్లిక్‌లో ఇమేజ్‌ను ప్రభావితం చేశాయని బాధపడ్డాడు. పెళ్లికి ముందు అనేక మందితో సంబంధాలు కలిగి ఉన్నట్లు తాజా ఇంటర్వ్యూలో అంగీకరించిన హీరో.. 'నన్ను, నా గతాన్ని తేలికగా తీసుకోండి. ఎదుకంటే ఇప్పుడు నేను నా జీవితంతోపాటు నా పనిని, కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తున్నా. ఇంతకుముందు నాలైఫ్‌లో పెనవేసుకున్న బంధాలన్నింటికీ కృతజ్ఞుడిగానే ఉన్నా. ప్రజలు నా గురించి ఏదైనా మంచి, చెడు చెప్పగలరు. కానీ చివరికి ఏది ఏమైనా నా సినిమాలను తప్పక ఇష్టపడతారు. కాబట్టి నా దృష్టి, నా కృషి, నా శక్తియుక్తులన్నీ కేవలం మంచి సినిమా తీయడం వైపు మాత్రమే ఉంటాయి. చెడు మాటలు నన్ను బాధించవు' అని వివరించాడు. అలాగే తాను కాసనోవా పోస్టర్ బాయ్‌గా మారానంటూ ఫన్నీగా చెప్పిన నటుడు.. కొంతమంది తనను మోసగాడిగా ముద్ర వేసినా తనకేమీ కోపం లేదని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed