ఆర్‌జీవీ అసలు బాగోతం బయటపెట్టిన సోదరి.. అమ్మాయిల పిచ్చి అంటూ

by Disha News Desk |
ఆర్‌జీవీ అసలు బాగోతం బయటపెట్టిన సోదరి.. అమ్మాయిల పిచ్చి అంటూ
X

దిశ, సినిమా : సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోదరి విజయలక్ష్మి ఆర్‌జీవీ అసలు క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ‌లో ఫ్యామిలీ గురించి మాట్లాడిన ఆమె వర్మకు సంబంధించిన అసలు నిజాలు బయటపెట్టింది. 'నిజంగానే వర్మకు పెళ్లి అంటే నచ్చదు. పెళ్లి చేసుకోవడం వల్ల తనేమీ కష్టాలపాలవలేదు. కానీ ఆ బంధం కారణంగా జీవితాన్ని తాకట్టు పెట్టడం నచ్చలేదంటాడు. అందరూ అనుకున్నట్లు వర్మకు అమ్మాయిల పిచ్చి అసలే లేదు. నిజానికి ముక్కుసూటిగా ఉండే వర్మ.. సంతోషపెట్టే మాటలే తప్ప ఏ రోజు ఆడ పిల్లలతో మిస్ బిహేవ్ చేయలేదు.

ఏ అమ్మాయి అతనిపై ఫిర్యాదు చేసిన చరిత్ర లేదు. అయితే ఇటీవల సెలబ్రిటీలతో డాన్సులు చేయడం కూడా సరదా కోసమే. మేము ఈ విషయాలపై అడిగితే.. నేనేంటో తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ఎఫెక్ట్ కోసం చేస్తానని మీకు తెలుసు కదా..' అంటూ జోకులు పేల్చుతాడని వివరించింది. ఇక అంతకు ముందు కూడా వర్మ తల్లి 'వాడు చెప్పేది అంతా అబద్దమే. నిజంగా రామ్ చాలా మంచివాడు' అని చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story