ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న రామ్ చరణ్ బ్యూటీ.. కన్నీరుమున్నీరవుతున్న ఫ్యాన్స్

by Kavitha |
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న రామ్ చరణ్ బ్యూటీ.. కన్నీరుమున్నీరవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ‘సత్యం’(Satyam) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా(Genelia) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో తన అందం, నటనతో మంచి మార్కులే కొట్టేసింది. అలా ‘సాంబ’(Samba), ‘నా అల్లుడు’(Naa Alludu), ‘సుభాష్ చంద్రబోస్’(Subhash Chandra Bose), ‘సై’(Sye), ‘హ్యాపీ’(Happy), ‘రామ్’(Ram), ‘బొమ్మరిల్లు’(Bommarillu), ‘ఢీ’(Dhee), ‘రెడీ’(Ready), ‘ఆరెంజ్’(Orange), ‘నా ఇష్టం’(Naa Istam) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఇలా వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూ సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి సినిమాలకు దూరమైంది. కాగా ఈమెకు ప్రస్తుతం ఇద్దరు బాబులు. భర్త, పిల్లలతో మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. కానీ సినిమాల్లోకి రీ ఎంట్రీ గురించి మాత్రం మాట్లాడట్లేదు.

ఇదిలా ఉంటే.. పైకి హ్యాపీగా కనిపించే జెనీలియా ఓ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుందట. ప్రస్తుతం దీనికి సంబంధిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఈ అమ్మడు ఓ జబ్బు కారణంగా చాలా రోజుల నుంచి బాధపడుతుందట. ఆమెకి క్లైమేట్ చేంజ్ అయిన బాడీలో వెంటనే చెంజెస్ వస్తాయట. మరీ ముఖ్యంగా స్వీట్స్, కూల్ డ్రింక్ అలాగే కూల్ వాటర్, చల్లని పదార్థాలు తీసుకున్న వెంటనే బాడి పై రాషెస్ వచ్చేస్తాయట. ఈ భామకు వెంటనే కళ్లు కూడా మసక మసకగా కనిపిస్తాయట. అందుకే ఈమె ఎప్పుడూ కూడా వార్మ్ టెంపరేచర్‌లో ఉన్న నీళ్లనే తీసుకుంటుందట.

అంతేకాదు కూల్ క్లైమేట్ జోలికి అస్సలు వెళ్లదట. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ముందు జాగ్రత్తలు తీసుకుంటుందట. దీని కోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న సరే ఇప్పటికి ఈ వ్యాధి క్యూర్ కాలేదట. దీంతో జెనీలియా చాలా బాధపడుతున్నదంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారగా.. ఆమె ఫ్యాన్స్ ‘అయ్యో జెనీలియా నీకెంత కష్టం వచ్చింది’ అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Advertisement

Next Story