- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Charan: కడప అమీన్ పీర్ దర్గాకు హాజరుకానున్న రామ్ చరణ్..!
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రజెంట్ ‘గేమ్ చేంజర్’ (game changer) చిత్రంతో బిజీగా ఉన్నాడు. శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి (January) 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ (Promotions Start) చేసిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ (Updates) ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ కడప దుర్గాకు వెళ్లనున్నట్లు ఓ వార్త వినిపిస్తోంది. అయితే.. కడప దర్గాలో ప్రతి ఏటా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కడప అమీన్ పీర్ దర్గా (Kadapa Amin Peer Dargah) (పెద్ద దర్గా) నవంబర్ 16 నుండి 21 వరకు జరిగే పెద్ద ఉరుసు ఉత్సవాలు గ్రాండ్‌గా జరగనున్నాయి. ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు పీర్ దర్గా పీఠాధిపతి ఖ్వాజ సయ్యద్ షా అరిపుల్లా హుస్సేని (Khwaja Syed Shah Aripullah Hussaini).
ఇందులో భాగంగా ఈసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ముస్లింలు మక్కా తర్వాత అతి పవిత్ర ప్రదేశంగా భావించే కడప అమీన్ పీర్ దర్గాకు వస్తానని రామ్ చరణ్ కూడా చెప్పినున్నట్లు సమాచారం. అంతే కాకుండా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నట్లు సమాచారం. ఇక ఈ 18నే ఈ వేడుకకు చరణ్ హాజరుకానున్నారని సమాచారం రాగా.. ఆయన ప్రస్తుతం అయ్యప్ప మాల ధారణలో ఉన్నారు. దీక్షలో ఉండగానే వస్తారా లేదా ఆలోగా దీక్ష ముగుస్తోందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. గేమ్ చేంజర్ చిత్రంలో కియారా అద్వాని (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి (Anjali), సముద్రఖని (samudrakhani), ఎస్‌జె సూర్య (SJ Surya), శ్రీకాంత్ (Srikanth), సునీల్ (Sunil), జయరాం (Jayaram), నవీన్ చంద్ర (Naveen Chandra) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Read More ..