- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల..!!
దిశ, వెబ్‌డెస్క్: శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan) హీరోగా.. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్(Srikanth), సునీల్(Sunil), అంజలి(Anjali), సముద్ర ఖని(Samudra khani) పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు. ల్మోస్ట్ ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ భారీ ప్రాజెక్ట్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 10 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. కాగా మూవీ టీమ్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగానే నేడు మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు ఓ భారీ గుడ్ న్యూస్ చెప్పారు. నవంబరు 9 వ తేదీన ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. టీజర్ కార్యక్రమాన్ని కూడా లక్నోలో భారీగా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. శుభవార్త తెలియజేస్తూనే మేకర్స్ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి సినీ ప్రియులకు ఉత్సాహాన్ని నింపారు. ఈ పోస్టర్‌లో కియారా అద్వానీ సాగరకన్యలా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.