- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rakul Preet Singh: తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన రకుల్
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో ఉన్న రకూల్ తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం తాను గాయం నుండి కొలుకుంటున్నాని తెలిపింది. డాక్టర్స్ సూచన మేరకు కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవడానికి సిద్దమయ్యానని తెలుపుతూ.. 'ఆరోగ్యమే మహాభాగ్యం. స్వేచ్చగా తిరుగుతున్నందుకు ఎంత కృతజ్ఞతతో ఉండాలో తరుచూ మనం మర్చిపోతుంటాం' అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా రకుల్ కు వెన్నుముఖకు గాయం అయింది. ఆ నొప్పిని పట్టించుకోకుండా షూట్ లో పాల్గొనగా.. నొప్పి తీవ్రత పెరిగి ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా రకూల్ ఆసుపత్రిలో చేరికపై ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియా వేదిక ద్వారా తను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు.