- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నెలాఖరులో ఎగరనున్న ఆకాశ ఎయిర్ విమానాలు!
న్యూఢిల్లీ: బడ్జెట్ ఎయిర్‌లైన్‌గా భారత్‌లో ప్రారంభం కానున్న విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ గురువారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను అందుకుంది. దీంతో త్వరలో దేశీయంగా వాణిజ్య కార్యకలాపాలకు ఆకాశ ఎయిర్ గ్రీన్ సిగ్నల్ అందుకుంది. ఈ సందర్భంగా స్పందించిన సంస్థ, డీజీసీఏ నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ అనుమతి లభించడం పట్ల సంతోషంగా ఉంది. సంస్థ వాణిజ్య కార్యకలాపాలకు ముందు ఇది తమకు ముఖ్యమైన మైలురాయి.
దీని ద్వారా విమానాల సేవలను ప్రారంభించడానికి వీలవుతుందని ఆకాశ ఎయిర్ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే నెలాఖరులోగా సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనుందని పేర్కొంది. ఈ అనుమతుల తర్వాత ఆకాశ ఎయిర్ సంస్థ భారత్‌లో ఎనిమిదో దేశీయ విమానయాన సంస్థగా అవతరించింది. ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా మద్దతుతో ఏర్పాటవుతున్న ఆకాశ ఎయిర్ సంస్థ ఇప్పటికే అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 18 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేసింది. విమానయాన సంస్థ మొత్తం 72 విమానాలతో సేవలను అందించనున్నట్టు ఇదివరకే వెల్లడించింది.