కోడలిపై కన్నేసిన మామ.. పైసలు కావాలన్నందుకు తనతో..

by S Gopi |   ( Updated:2022-03-17 02:19:20.0  )
కోడలిపై కన్నేసిన మామ.. పైసలు కావాలన్నందుకు తనతో..
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఆధునిక యుగంలో మనిషి ఎన్నో విషయాలకు సంబంధించి ముందడుగు వేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కానీ.. కొంతమందిలో మాత్రం మార్పు రావడంలేదు. కామంతో కృరమృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. కన్నుమిన్ను కానరాకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. కాపాడాల్సిన వాళ్లే కాటేస్తున్నారు. రాజస్థాన్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న కోడలికి అండగా నిలవాల్సిన మామ దారుణంగా ప్రవర్తించాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ అసభ్యంగా వ్యవహరించాడు.

ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని అజ్మీర్ కు చెందిన ఓ మహిళ భర్త మరణించాడు. అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో పుట్టింటిలోనే ఉంటోంది. అయితే, తన పిల్లలను పాఠశాలలో చేర్పించాలనుకుంది. అందుకోసం ఆమె వద్ద డబ్బులు లేకపోవడంతో తన మామను ఆర్థిక సాయం చేయాలని కోరింది. ఆ సమయంలో బాధ్యతగా మెలగాల్సిన అతను ఆమెతో దారుణంగా ప్రవర్తంచాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకుంటేనే ఆర్థిక సాయం చేస్తానని అసభ్యంగా మాట్లాడాడు. ఇదంతా కూడా రికార్డు చేసిన బాధిత మహిళ విషయాన్ని తన భర్త సోదరుడికి చెప్పింది. అతను కూడా పట్టించుకోలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ లో అతను అసభ్యంగా మాట్లాడిన మాటలను రికార్డు చేసి పోలీసులకు వినిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story