- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘SSMB-29’ కోసం ప్రాసెస్ రివర్స్ చేసిన రాజమౌళి.. ప్లాన్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్!
దిశ, సినిమా: దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), మహేష్(Mahesh Babu) కాంబోలో ‘SSMB29’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. కానీ ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ విడుదల కాలేదు. గత కొద్ది కాలంగా పలు వార్తలు మాత్రం ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. అయితే ఇటీవల రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలియజేశారు. దీంతో SSMB-29 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉందే. ఈ క్రమంలో.. తాజాగా, SSMB-29 చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది సూపర్ స్టార్ (superstar)అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ మూవీ తొందరగానే షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు(Mahesh Babu) సినిమా కోసం షూటింగ్ ప్రాసెస్‌ని రాజమౌళి రివర్స్ చేశారట.
అదేలాగంటే.. ఈసారి ముందు విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసి.. తర్వాత షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు టాక్. ఇప్పటికే 40 శాతం వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయిందని సమాచారం. దీన్ని బట్టి ఈ సినిమా రాజమౌళి గత చిత్రాల్లా కాకుండా.. త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ప్లాన్ సూపర్ అని ఫుల్ ఖుషీ అవుతున్నారు.