Game Changer: ఈ పాత్రలోంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది.. వైరల్‌గా హీరోయిన్ కామెంట్స్

by sudharani |   ( Updated:2025-01-03 15:37:38.0  )
Game Changer: ఈ పాత్రలోంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది.. వైరల్‌గా హీరోయిన్ కామెంట్స్
X

దిశ, సినిమా: గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంక‌ర్ (Shankar) కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). ఈ భారీ బడ్జెట్ (Big budget) మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్పణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ (Trailer) ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా హీరోయిన్ అంజలి (Anjali) మాట్లాడుతూ.. ‘‘గేమ్ చేంజర్’ నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైంది. ఈ పాత్రలోంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. ఇంత మంచి పాత్రను ఇచ్చినందుకు డైరెక్టర్ శంకర్‌కు థాంక్స్. ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తుంటాయి. రామ్ చరణ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. కో ఆర్టిస్ట్‌లకు చాలా కంఫర్ట్ ఇస్తుంటారు. నా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌కి థాంక్స్. జనవరి 10న గేమ్ చేంజర్ ఏంటో అందరికీ తెలుస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story